న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆటగాడు, ఢిల్లీ సీనియర్‌ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ అమిత్‌ భండారీపై దాడికి పాల్పడ్డ అండర్‌-23 క్రికెటర్‌ అనూ జ్‌ దెడాపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఢిల్లీ క్రికెట్‌ సంఘం (డీడీసీఏ) సిద్ధమైంది. అనూజ్‌ భవిష్యత్‌లో క్రికెట్‌ ఆడకుండా అతనిపై జీవితకాల నిషే ధం విధించాలని నిర్ణయించినట్టు డీసీసీఏ అధ్యక్షుడు రజత్‌ శర్మ ప్రకటించారు. దాడికి పాల్పడ్డ ఆ క్రికెటర్‌ను అసలు క్రికెట్‌ ఆడకుండా నిషేధించాలని మాజీ క్రికెటర్లు సెహ్వాగ్‌, గంభీర్‌ ఇప్పటికే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ‘అనూజ్‌పై జీవితకాల నిషేధం విధించడమే సరైన చర్య. దాడి ఘటనపై విచారణ జరుగుతోంది. అలాగే, కొందరు ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేస్తున్నారంటూ కొందరు సెలెక్టర్లపైనా ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిపైనా విచారణ చేపట్టాలనుకుంటున్నాం’ అని రజత్‌ తెలిపారు. అండర్‌-23 జట్టులో తనను ఎంపికచేయనందుకు అనూజ్‌ తన సోదరుడు హరీష్‌ మరికొందరితో కలిసి భండారీపై ఇనుపరాడ్లు, హాకీ స్టిక్కులతో దాడికి పాల్పడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here