జైపూర్: ఐదు శాతం రిజర్వేషన్ల డిమాండుతో గుజ్జర్లు గత ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గుజ్జర్లు డిమాండ్ చేస్తున్నట్టుగా విద్య, ఉద్యోగాల్లో గుజ్జర్లు, మరో నాలుగు కులాలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును రాజస్థాన్ అసెంబ్లీ బుధవారంనాడు ఆమోదించింది. ఇందుకు సంబంధించి రాజస్థాన్ వెనుకబడిన తరగతుల సవరణ బిల్లు-2019ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అనంతరం సభ దీనిని ఆమోదించింది.
బిల్లు ప్రకారం వెనుకబడిన తరగతులకు ప్రస్తుతం అమలు చేస్తున్న 21 శాతం రిజర్వేషన్‌ను 26 శాతానికి పెంచారు. పెంచిన ఐదు శాతం రిజర్వేషన్‌ను గుజ్జర్లు, బంజారాలు, గడియా లోహార్‌లు, రైకస్, గడరియా కులాలకు వర్తింపజేస్తారు. పైన పేర్కొన్న ఐదు కులాలు బాగా వెనుకబడిన తరగతులని, ఆ కులాలకు 5 శాతం రిజర్వేషన్ అనివార్యమని బిల్లు పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here