పుదుచ్చేరి : గవర్నర్ కిరణ్ బేడీ వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి నారాయణ స్వామి చాలా కాలం నుంచి నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం ఆయన నల్ల దుస్తులు ధరించి పుదుచ్చేరి రాజ్‌ భవన్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. కిరణ్ బేడీని గవర్నర్ పదవి నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీజీపీ జారీ చేసిన శిరస్త్రాణ ధారణ నిబంధనను దశలవారీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కిరణ్ బేడీ రాష్ట్ర పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని నారాయణ స్వామి ఆరోపిస్తున్నారు. గత నెల 4న పుదుచ్చేరి రాజకీయ పార్టీలు దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here