బెంగళూరు: రెబల్స్‌గా మారిన నలుగురి ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ రమేశ్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చిన కాంగ్రెస్‌ అగ్రనేతలు మరోవైపు బుజ్జగింపులు కొనసాగిస్తున్నారు. నలుగురిని కోల్పోతే సంకీర్ణ ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉన్నట్లేనని భావించిన కాంగ్రెస్‌ నేతలు మరోసారి వారిని బుజ్జగించేందుకు సిద్ధమయ్యారు. సోమవారం రాత్రి రమేశ్‌ జార్కిహొళి సోదరుడు, ఎమ్మెల్యే బాలచంద్ర జార్కిహొళితో పొద్దుపోయేదాకా సీఎం కుమారస్వామి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. బాలచంద్రతో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కె.సి.వేణుగోపాల్‌ కూడా ప్రత్యేక చర్చలు సాగించారు. రమేశ్‌జార్కిహొళికి మంత్రి పదవి కేటాయిస్తామని ఆయన సూచించినవారికి బోర్డులు, కార్పొరేషన్‌లలో కీలకమైన పదవులను ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు వివాదం ఎందుకొచ్చిందీ… తెగే దాకా లాగడం సరికాదనే రీతిలో వేణుగోపాల్‌ మాట్లాడినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here