అందుబాటులో 10 రకాల మందులు

ఈ-సబ్‌ సెంటర్లకు నేడు సీఎం శ్రీకారం

అమరావతి, గుంటూరు, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బీసీ, షుగర్‌ రోగులకు ప్రైవేటు మందుల షాపుల్లో కూడా ఉచితంగా మందులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఐసీఎంఆర్‌, కలాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా రాష్ట్రంలో సర్వే చేశాయి. ప్రైవేటు రంగంలో బీసీ, షుగర్‌ మందులకు వెచ్చించే వేలాది రూపాయలతో రోగుల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని గుర్తించాయి. మందులను ఉచితంగా అందించడం ద్వారా ఆర్థిక వెసులబాటు కలుగుతుందని ఆ సంస్థలు సిఫార్సు చేశాయి. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఆరోగ్యశాఖ ఏపీఈఆర్‌ఎక్స్‌ యాప్‌ ద్వారా టీబీ రోగులకు ప్రైవేటు మెడికల్‌ షాపుల ద్వారా మందులు అందిస్తోంది. ఇదే యాప్‌ ద్వారా బీపీ, షుగర్‌ రోగులకు కూడా ఉచితంగా మందులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా విధివిధానాలు ఖరారు చేసింది. ఉచితంగా మందులు తీసుకోవాలని భావించే రోగులు కచ్చితంగా ఆరు నెలలకు ఒకసారి రక్తపరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు మందుల షాపుల యజమానులకు వారానికి ఒకసారి ఆరోగ్యశాఖ బిల్లులను చెల్లిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here