పార్లమెంటు వద్ద మంగళవారం కలకలం రేగింది. 2001లో ఉగ్రవాదులు చొరబడిన ద్వారం నుంచి ఓ కారు వస్తుండటాన్ని గమనించిన భద్రతాధికారులు రెప్పపాటులో అప్రమత్తమయ్యారు. ఈ కారు బారికేడ్లలోకి చొరబడి వస్తుండటంతో స్పైక్స్‌ను యాక్టివేట్ చేశారు. ఆ కారు స్పైక్స్‌ను ఢీకొట్టడంతో భద్రతా సిబ్బంది మరుక్షణం పోరాటానికి సిద్ధమయ్యారు. కారు బంపర్ దెబ్బతినడంతో ఆ డ్రైవర్ కారును ఆపేశాడు.
ఈ కారు మణిపూర్ ఎంపీ, కాంగ్రెస్ నేత డాక్టర్ థోక్చోమ్‌కు చెందినదని ఓ వార్తా సంస్థ తెలిపింది. అయితే ఆయన ఆ సమయంలో కారులో లేనట్లు పేర్కొంది. పార్లమెంటులో ప్రవేశానికి అనుమతి లేని ద్వారం గుండా ఈ కారు చొరబడటంతో కలకలం రేగిందని పేర్కొంది.
2001లో ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేసిన తర్వాత భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఏదైనా అవాంఛనీయ ఘటన కనిపించగానే భద్రతాధికారులు రెప్పపాటులో చర్యలకు సిద్ధమయ్యేలా ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here