రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఘాటుగా స్పందించారు. జైట్లీ మంగళవారం ఓ ఫేస్‌బుక్ పోస్ట్‌లో కాంగ్రెస్‌ను క్షీణిస్తున్న రాజవంశంగా అభివర్ణించారు. ప్రతి రోజు ఓ అబద్ధాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు.
రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎన్డీయే ప్రభుత్వం  ఆదా చేసినట్లు తెలిపారు. ప్రతిపక్షాలు రోజువారీ ప్రాతిపదికపై కొత్త కొత్త అబద్ధాలను సృష్టిస్తున్నాయని ఆరోపించారు. తాజాగా కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్)పైనా, రఫేల్ ఒప్పందం ప్రక్రియలో ఆయన భాగస్వామ్యంపైనా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. రూ.500 కోట్లు వర్సెస్ రూ.1,600 కోట్లు పసి పిల్లల వాదన కల్పితమని రాజవంశీకుడికి తెలుసునన్నారు. రాజవంశీకుడు (రాహుల్ గాంధీ), ఆయన మిత్రులు గతంలో రఫేల్ ఒప్పందంపై రిట్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టుపై కూడా విమర్శలు గుప్పించారని గుర్తు చేశారు. ధరల గురించి మొత్తం వాదన కచ్చితంగా తప్పు అని తెలిపారు. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, సీసీఎస్, కాంట్రాక్ట్ చర్చల కమిటీ లేవని చెప్పడం కూడా శుద్ధ అబద్ధమని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here