సోషల్‌ మీడియాతో ఎదురయ్యే సమస్యల గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఒత్తిడి, అశాంతి, ఒంటరితనం, డిప్రెషన్‌ తదితర లక్షణాలన్నీ సోషల్‌ మీడియాతోనే సంక్రమిస్తాయి. ఇన్ని అవలక్షణాలు వస్తున్నా దీని వాడకం రోజురోజుకీ తగ్గుతోందే తప్ప పెరగడం లేదు. దీని వాడకం ఆడపిల్లలు, మగపిల్లల మీద ఎంత ప్రభావాన్ని చూపుతుందన్న విషయం మీద ఇటీవల ఓ అధ్యయనం నిర్వహించారు. మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల మీదే దీని ప్రభావం ఎక్కువగా ఉన్న విషయం స్పష్టమైంది. సోషల్‌ మీడియా ఉపయోగించే ఆడపిల్లల్లో ఒత్తిడి, డిప్రెషన్‌, అశాంతి లక్షణాలు ఎక్కువగా ఉండడాన్ని వీరు గుర్తించారు. చిన్నతనంలోనే వీటి బారిన పడిన ఆడపిల్లలు పెద్దయిన తరువాత తీవ్రమైన ఆరోగ్యసమస్యలను ఎదుర్కొక తప్పదని వారు స్పష్టం చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here